1 June, 2026 | 3:07 PM

పవన్ క్షమాపణలు చెప్పిన తర్వాతే.. సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం

01-06-2026 02:34 PM

బీజేపీతో ఒప్పందం మేరకే పవన్ నటన

పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(AP Dy CM Pawan Kalyan) తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని పొన్నం ప్రభాకర్(Ponnam prabhakar) పేర్కొన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ పునరుద్ఘటించారు. తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు. దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నారు. దిష్టి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని పవన్ చెప్పారు.

హైదరాబాద్ లో పవన్ నవనిర్మాణ సభ(Pawan Kalyan Nava Nirmana Sankalpa Sabha) పెట్టాడాన్ని ఆక్షేపిస్తున్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీజేపీతో ఒప్పందం మేరకే పవన్ నటన ప్రారంభించారని ఆరోపించారు. తెలంగాణను బీజేపీకి తాకట్టు పట్టడమే పవన్ చెప్పే నవ నిర్మాణమా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.  తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ బీజేపీ ఎజెండా మోస్తున్నారని తెలిపారు. తెలంగాణ ద్వేషి పవన్ కళ్యాణ్ ఇక్కడ విద్వేష రాజకీయాలు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకక, ఏజెంట్ గా పవన్ కళ్యాణ్ ఇక్కడికి పంపిస్తున్నారని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన ఏమీ లేదు, అందుకే ఇక్కడ బీజేపీ దొడ్డిదారిన పవన్ కళ్యాణ్ ను పంపిస్తోందని తెలిపారు.