1 June, 2026 | 3:04 PM

ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కోఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్ పాషా

01-06-2026 02:33 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీ 13వ వార్డు పరిధిలోనీ  మహిళలకు సోమవారం మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్ పాషా, కౌన్సిలర్ ఖాలేక్ చేతుల మీదుగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుల ఆదేశానుసారం పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని వారు తెలిపారు.