హైదరాబాద్ రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించిన మంత్రి పొన్నం
ఆర్టీసీ విలీన ప్రక్రియపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(Telangana State Road Transport Corporation) కూకట్ పల్లి బస్ డిపోలో( Kukatpally Depot) జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఈవీ బస్సులను ప్రారంభించారు. అనంతరం నూతన ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణించారు. కూకట్ పల్లి డిపోకు 60 ఈవీ బస్సులు కేటాయించామని మంత్రి పొన్నం వెల్లడించారు. ఆర్టీసీలో అనేక సంస్కరణలు తెచ్చామని తెలిపారు.
హైదరాబాద్.. ఢిల్లీలా మారవద్దనే ఈవీ బస్సులు తెచ్చామన్నారు. ఈవీ బస్సులతో ఆర్థిక భారం నుంచి బయటపడవచ్చని తెలిపారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రవాణా వ్యవస్థకు భారంగా మారాయని మంత్రి పొన్నం వెల్లడించారు. త్వరలోనే ఆర్టీసీ విలీన ప్రక్రియ(RTC Merger Process) చేపడతామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం దృష్ట్యా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao), ఎమ్మెల్సీ నవీన్, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బండి రమేష్ ,ఆర్టీసీ ఎం.డి నాగి రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు.






