ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం పర్యటన
21-09-2024 01:17 PM
హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పర్యటించారు.వనస్థలిపురంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలించారు. మూసీనది సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. మూసీ నిర్వాసితులకు జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామన్నారు. మహిళలకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. మూసీ సుందరీకరణ పనులకు ప్రజలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.




