7 April, 2026 | 11:50 AM

Breaking News

సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •  

వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం

15-02-2026 01:39 PM

హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి భీమేశ్వరాలయంలో  శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి సతీసమేతంగా  ప్రత్యేక పూజలు చేశారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురు మామిడి మండల కేంద్రంలోని శివాలయంలో స్వామివారిని, పొట్లపల్లి  స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి  శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పూజలు, ఉపవాసాలు, జాగరణలు చేస్తూ ఆ మహాదేవుడిని ఆరాధించే భక్తకోటికి సుఖ సంతోషాలను, శాంతి సౌభాగ్యాలను ప్రసాదించాలని భగవంతుడిని  ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.