త్వరలో కేబినెట్ విస్తరణ.. హోంమంత్రి ఎవరికంటే..?
01-07-2024 08:26 PM
హైదరాబాద్ : త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలంగాణ మంత్రి దామోదార రాజనర్సింహ వెల్లడించారు. సోమవారం మీడియా సమావేశంలో కీలక అంశాలు తెలిపారు. కొత్తగా ఐదరుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.
సీతక్కకు హోంమంత్రి ఇచ్చే అవకాశం ఉందని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఒకరిని కేబినెట్ లోకి తీసుకోవచ్చాని ఆయన పేర్కొన్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపైనా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోందని, అతిత్వరలోనే చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉందని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.






