కేసీఆర్, బీఆర్‌ఎస్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
05-07-2024 06:25 PM
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని సీతక్క ఆరోపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియో పెట్టారని వాపోయారు. లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని సీతక్క లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. జూన్ 24న బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియాలో ఇందిరమ్మ రాజ్యం.. ఇసుకరాళ్ల రాజ్యం పేరుతో సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టారని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేశారన్న మంత్రి సీతక్క తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.






