15-11-2025 03:10:51 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.