భారీ వర్షాలకు డ అప్రమత్తంగా ఉండాలి
01-09-2024 07:52 PM
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): భారీ వర్షాలకు పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలు, మంథని నియోజకవర్గ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. భారీ వర్షాలకు వరద నీటి ప్రవాహాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ శాఖ, రెవెన్యూ అధికారులు ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలను అందించాలని, జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు పోలీసు అధికారులను ఆదేశించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో, కాలువలు చెరువుల ప్రాంతాల్లో పశువులను, మేకలను మేపడాని, చేపలు వేటకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళవద్దని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.






