12 June, 2026 | 1:24 AM

అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి మంత్రి శ్రీధర్‌బాబు భరోసా

12-06-2026 12:00 AM

రూ. 2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

మంథని, జూన్ ౧1 (విజయక్రాంతి) : అనారోగ్యంతో బాధపడుతున్న మంథని నియోజకవర్గం, కాటారం మండలం, గారేపల్లి గ్రామానికి చెందిన విలాసాగరం లక్ష్మి కి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  అండగా నిలిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మికి మెరుగైన వైద్యం కోసం ప్రస్తుతం హైదరాబాద్లోని నిమ్స్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకురాగా, ఆయన మానవతా దృక్పథంతో స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి  ద్వారా బాధితురాలి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2లక్షల ఎల్.ఓ.సిని వెంటనే మంజూరు చేయించారు. ఈ సహాయానికి సంబంధించిన పత్రాలను హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి  సహాయకులు బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచి, తక్షణమే వైద్య సహాయం అందేలా చొరవ చూపిన మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.