16 August, 2026 | 9:55 PM

వివాహ వేడుకలో మంత్రి శ్రీధర్ బాబు

16-08-2026 09:00 PM

నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన మంత్రి

ముత్తారం, ఆగస్టు 16 (విజయక్రాంతి): ముత్తారం మండలం జిల్లాలపల్లె గ్రామ సర్పంచ్ గడ్డం రాజేశం ముదిరాజ్ కుమారుడు గడ్డం సంతోష్ ముదిరాజ్–శ్రావ్య వివాహ వేడుక ఆదివారం ధర్మారంలోని మహేశ్వర ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. మంత్రి వివాహ వేడుకకు హాజరుకావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రజల సుఖదుఃఖాల్లో భాగస్వామిగా ఉంటూ, కుటుంబ కార్యక్రమాలకు సైతం హాజరవుతున్న మంత్రి శ్రీధర్ బాబు పట్ల స్థానిక కాంగ్రెస్ శ్రేణులు అభినందనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం ముదిరాజ్, ముత్తారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బియ్యని శివకుమార్ ముదిరాజ్, ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.