అనారోగ్యంతో ఉన్న దేవస్థానం చైర్మన్‌కు మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ
మంథని, ఆగస్టు 27 (విజయ క్రాంతి): కరీంనగర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రామగిరి మండలం సుందిల్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్(Korakoppula Satyanarayana)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబు సత్యనారాయణ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజా సేవలో తిరిగి పాల్గొనాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు ఆప్యాయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో సత్యనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






