7 April, 2026 | 4:16 PM

వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలి

07-05-2024 01:09 AM

మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

కాంగ్రెస్‌లోకి ముత్తారం బీఆర్‌ఎస్ ఎంపీటీసీ

మంథని, మే 6(విజయక్రాంత్రి): పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పార్టీ నాయకులు, నూతనంగా చేరుతున్న వారితో కలిసి పనిచేయలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని పోతారం, ముత్తారం గ్రామాలకు చెందిన 100 మంది బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. వారికి మంత్రి శ్రీధర్‌బాబు కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోతారం మాజీ ఎంపీటీసీ చెలకల లింగభావాని సుధీర్‌తోపాటు, ఒడ్డెర కుల సంఘం నాయ కులు, ముత్తారం బీఆర్‌ఎస్ నాయకుడు సిరిమల్ల తిరుమల్ తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జడ్పీటీసీ జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.