వేలు కొరికేసిన కుక్క!
07-04-2026 04:13 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కళ్యాణ గ్రామంలో పిచ్చికుక్క ఓ వ్యక్తిపై దాడి చేసి అతని చేతి వేలిని కొరికేసింది. గ్రామానికి చెందిన చిరుత సతీష్ అనే వ్యక్తిపై పిచ్చికుక్క దాడి చేసి విచక్షణారహితంగా కరిచింది. అంతటితో ఆగకుండా అతడి ఎడమచేతి వేలిని పూర్తిగా కోరిక వేసింది. దీనితో అతడి వేలు పూర్తిగా కింద పడిపోయింది. ఈ సంఘటన చూసిన కొందరు అక్కడికి వచ్చి కుక్కను తరిమి వేశారు. దీనితో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.




