మాజీ జడ్పీటీసీ కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు అండ
కేశనపల్లిలో లింగయ్య దశదినకర్మకు హాజరై నివాళులర్పించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
ముత్తారం,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరోసారి తన మానవీయతను చాటుకున్నారు. ముత్తారం*మండలంలోని కేసనపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం తండ్రి చొప్పరి లింగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, సోమవారం నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మంత్రి, సదానందం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంత్రి రాకతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొనగా, స్థానికులు ఆయన కుటుంబంపై చూపిన ఆప్యాయత, పరామర్శను అభినందించారు.






