మల్లారెడ్డి నోటా కేసీఆర్ పాట
20-07-2026 09:53 PM
మేడ్చల్,(విజయ క్రాంతి): బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మళ్లీ కెసిఆర్ పాట పాడారు. మేడ్చల్ మండలం కోనాయిపల్లి లో జరిగిన శివాజీ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ శివాజీ వలె పోరాడి మనందరం కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. అంతేగాక కేసీఆర్ వల్ల తాను ఎమ్మెల్యే, మంత్రి అయ్యానన్నారు. ఘట్కేసర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కెసిఆర్ ను విమర్శిస్తుంటే మౌనంగా ఉన్న మల్లారెడ్డి కోనాయిపల్లి లో కేసీఆర్ గురించి మాట్లాడడం గమనార్హం. రేవంత్ రెడ్డి విమర్శలపై మల్లారెడ్డి మాట్లాడ లేదు.






