calender_icon.png 3 February, 2026 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పట్ల గ్రామ పంచాయతీ అభివృద్ధికి మంత్రి సహకారంతో కృషి చేస్తా

02-02-2026 09:49:27 PM

మంథని,(విజయక్రాంతి): ఉప్పట్ల గ్రామ పంచాయతీ అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ కాసిపేట వెంకటమ్మ తెలిపారు. సోమవారం సర్పంచ్ అధ్వర్యంలో నూతనంగా మంజూరైన గ్రామ పంచాయతీ భవనానికి పాలకవర్గంతో పాటు గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ జనగామ శ్రీనివాస్ తో పాటు వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కాసిపేట బాపు కాసిపేట, ఎరుకల ప్రవీణ్ కాసిపేట శ్రీనివాస్, కాసిపేట కుమార్, బడికల మనోజ్, ఇజ్జగిరి శంకర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.