calender_icon.png 2 February, 2026 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుడ్డ తండా నుంచే ఉపాధి హామీ మార్పుపై తీర్మానం

02-02-2026 09:53:06 PM

* అచ్చంపేట నుంచే ఉపాధి హామీ హక్కుల కోసం పోరాటం 

* చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాటం మొదలు  

* ఏఐసిసి జనరల్ సెక్రెటరీ మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ 

అచ్చంపేట: కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని మార్పు చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్న కూలీల హక్కులను హరించాలని చూస్తే ఊరుకోమని అందుకు ప్రజల నుంచి పోరాటం మొదలవుతుందని ఆ పోరాటం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బుడ్డతండా గ్రామపంచాయతీ ఉపాధి హామీ మార్పుపై వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు.  తీర్మానాన్ని ఎఐసిసి జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సమక్షంలో సర్పంచి గ్రామస్తులు తీర్మానం చేసిన పత్రాన్ని  ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతి కి పంపిస్తామన్నారు. 

గాంధీ పేరు తొలగిస్తే అభ్యంతరం లేదు.. కానీ 

దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూలీలకు కనీస వేతనం అమలు పరచాలని దృఢ సంకల్పంతో ఆనాడు ప్రధాని పివి నరసింహారావు ఎఐసిసి నేత సోనియా గాంధీ నేతృత్వంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసి కనీసం వంద రోజులు పనితో పాటు రూ. 200 కూలీ డబ్బులు అందేలా పథకాన్ని చట్టం చేసి అమలు చేస్తే.. పథకాన్ని తూట్లు పొడిచేలా ప్రస్తుత మోడీ ప్రభుత్వం పేరు మార్చి హక్కులు భరించే విధంగా చట్టాన్ని మార్చే కుట్రలు చేస్తే ఊరుకోమన్నారు. ఆ పథకానికి గాంధీ పేరు మారిస్తే మాకు అభ్యంతరం లేదని.. చట్టాన్ని మార్పులు చేయకూడదని యధావిధిగా ఉండాలని డిమాండ్ చేశారు. 

* చాకలమ్మ స్ఫూర్తితో లడాయి చేద్దాం..

తెలంగాణ విముక్తి కోసం ఆనాడు పోరాటం చేసిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో బుడ్డ తండా గ్రామము నుండి కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా లడాయి మొదలు పెడదామన్నారు. మనం బంధుకులు, కత్తులు, కటార్లు పట్టాల్సిన అవసరం లేదని రోకలిబండ, చీపురులతో నడుముకు కొంగు చుట్టి పోరాటాన్ని మొదలు పెడదామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.

విబి గ్రామ్ బి హటావో.. ఉపాధి హామీ బచావో అని నినాదాలు చేశారు. కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి, అమరేందర్ రెడ్డి, మహిళా నాయకురాలు శారదమ్మ, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, సర్పంచ్ నర్సింలు, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.