calender_icon.png 2 February, 2026 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని

02-02-2026 09:46:22 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): సనత్ నగర్ డివిజన్ శ్యామలకుంట లక్ష్మణ్ నగర్ బస్తీలో శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనత్ నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ శ్యామలకుంట బస్తి అధ్యక్షులు దళితరత్న అవార్డు గ్రహీత పుట్టల శేఖర్ ఎమ్మెల్యే తలసానికి శాలువాలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా పుట్టల శేఖర్ మాట్లాడుతూ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి మూడవ వార్షికోత్సవ వేడుకలు శ్యామలకుంట లక్ష్మణ్ నగర్ బస్తీలో బస్తివాసుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ వార్షికోత్సవ వేడుకలను చాలా ఘనంగా జరుపుతామని అమ్మవారి కళ్యాణాన్ని తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తారని మరి ఈ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని  అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే తలసాని కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ వార్షికోత్సవ వేడుకలకు సుమారు 1200 మందికి పైగా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ వేడుకలలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ నామాన శేషు కుమారి, డివిజన్ అధ్యక్షులు కోలను బాల్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, సుభాష్ నగర్ కైలాస్ నగర్ ప్రెసిడెంట్ భోగి బాలరాజ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు  ఇంకా ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు