calender_icon.png 13 February, 2026 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని అభివృద్ధిలో అన్న శ్రీధర్ బాబు

13-02-2026 07:02:39 PM

  1. పార్టీ బలోపేతానికి తమ్ముడు శ్రీనుబాబు 
  2. అన్ని తామై మంథని మున్సిపల్ ను గెలిపించిన దుదిళ్ల బ్రదర్స్ 
  3. శ్రీను బాబు దెబ్బకు కారు పంఛర్
  4. 13 వార్డులకు 11 వార్డు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 

మంథని, ఫిబ్రవరి13(విజయ క్రాంతి): మంథని  అభివృద్ధి లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అధిక నిధులు తీసుకు వచ్చి ముందుకు వెళుతుంటే...ఒక పక్క తమ్ముడు టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్ని తానై చక్రం తిప్పి మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంలో కిలకంగ వ్యవహంచారు. శ్రీను బాబు దెబ్బకు కారు పంఛర్ అయి కేవలం ఒక్క సీటుకే పరిమితం కాగా, 13 వార్డులకు గాను ఒక సీట్ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందగా,  ఏకంగా 11 వార్డు లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 

అభ్యర్థుల గెలుపు లో కీలకపాత్ర శ్రీనుబాబు 

మంథని మున్సిపల్ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు గెలుపులు శ్రీను బాబాయ్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ముందు ఐదు రోజులు మంథనిలోనే మకాం వేసి ప్రతి వాడలో ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేసిన కోట్ల రూపాయలతో  మంథని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, ఈ  మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు మంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. అలాగే శ్రీను బాబు నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజలకు అండగా ఉండడంతో కార్యకర్తల నాయకుల సహకారంతో మంథని మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించారు. 

మంత్రి చొరవతో మారనున్న మంథని రూపురేఖలు 

ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడంతో మంత్రి శ్రీధర్ బాబు మంథని పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో మంథని రూపు రేఖలు మారనునున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే మంథని పట్టణం నుంచి శ్రీరామ్ నగర్ వరకు నాలుగు లైన్ల రోడ్డు మంజూరు చేసి పనులు జరుగుతుండడంతో మంథనికి కొత్త కళ వస్తుంది. అలాగే కూచిరాజ్ పల్లి నుండి గోదావరి నది వరకు రూ. 80 కోట్లతో నిర్మించనున్న శ్రీ పాద మార్క్ రోడ్డు పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మంథని పట్టణంలో దాదాపు రూ. 50 కోట్లతో ప్రతి గల్లీకి సిమెంటు రోడ్లు నిర్మించి,  పట్టణంలో విద్యుత్ వెలుతురులతో మోడల్ సిటీగా కనబడుతుంది. అలాగే మంథని లో  అన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మించేందుకు నిధులు తీసుకువచ్చి మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల శంకుస్థాపనలు కూడా చేశారు.

మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ ను నూతన హంగులతో నిర్మించేందుకు దాదాపు రెండు కోట్లతో త్వరలోనే మార్కెట్ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయల తో అన్ని రంగాలలో మంథని పట్టణాన్ని,  నియోజకవర్గం ను నూతన హంగులతో మార్చేందుకు మంత్రి శ్రీధర్ బాబు కృతనిత్యంతో నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి మంథని ప్రజలు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సర్పంచులను గెలిపించారు. శుక్రవారం జరిగిన మంథని మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను  గెలిపించి ప్రజలు శ్రీధర్ బాబుకు బహుమతిగా ఇచ్చారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తమ్ముడు టీపిసిసి ప్రధాన కార్యదర్శి శీనుబాబు నిరంతరం మంథని నియోజకవర్గం పైనే దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తున్నారు.