29 April, 2026 | 9:36 PM

Breaking News

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •   పదిలో మెరిసిన జవహర్ నగర్ పేదింటి ఆణిముత్యాలు   •   పదో తరగతి ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత   •  

గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి

12-03-2026 11:50 AM

అప్పుడే గ్రామం పంచాయతీ అభివృద్ధి చెందుతుంది 

గుమ్మనూరు గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలని, అప్పుడే గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుందని, గుమ్మనూరు నూతన గ్రామ పంచాయతీ భవనం  ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. బుధవారం రాత్రి మంథని మండలంలోని గుమ్మనూరు గ్రామపంచాయతీ నూతన భవనాన్ని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్థానిక సర్పంచ్ చెరుకు తోట సురేష్ తోపాటు పంచాయతీ పాలకవర్గంతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తానని, పంచాయతీ పాలకవర్గం పార్టీలకతీతంగా గ్రామ ప్రజల అవసరాలు తెలుసుకొని పనిచేస్తే గ్రామంలోని ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటారని, అలాగే గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి తన వంతుగా కృషిచేసి అధిక నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సెగ్గం రాజేశం, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.