calender_icon.png 22 November, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఎన్టీయూహెచ్ వజ్రోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు

22-11-2025 12:50:23 PM

హైదరాబాద్: ఇంజినీర్లతో పనిచేస్తున్నప్పుడు తనకు చాలా సంతోషంగా అనిపిస్తోందని తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జేఎన్టీయూహెచ్ వజ్రోత్సవ వేడుకల్లో(JNTUH Diamond Jubilee celebration) మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తాను ప్రజా ప్రతినిధిగా ఉంటూ ఇంజినీర్లతో కలిసి పనిచేయాల్సి వస్తోందని వివరించారు. ఎలాంటి క్లిష్ట సమస్యనైనా ఇంజినీర్లు సులువుగా పరిష్కరిస్తారని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు.