calender_icon.png 20 February, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకే గుర్తింపునిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

20-02-2026 12:27:13 AM

మంథనిలో మున్సిపల్ పాలక వర్గానికి సన్మాన సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వేష్ గౌడ్

మంథని ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి) కాంగ్రెస్ పార్టీ లో కష్టపడే కార్యకర్తలకే రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గుర్తింపు ఇస్తున్నారని మంథని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూదరి సర్వేష్ గౌడ్ అన్నారు. మంథని పట్నంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాసును వైస్ చైర్మన్ ముసుకుల సయేందర్ రెడ్డి తో పాటు కౌన్సిలర్లకు సర్వేష్ గౌడ్ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సర్వేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, అందుకు నిదర్శనమే గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలని, ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలకు సర్పంచ్ గా కౌన్సిలర్లుగా గుర్తింపునిచ్చి వారిని గెలిపించి, గౌరవం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును ను సర్వేష్ గౌడ్ ను అభినందించారు.

రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ ముసుకుల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి కన్నూరి రవి, కాంగ్రెస్ నాయకులు తోకల మల్లేష్,కొయ్యల దేవేందర్, కిషన్ జి, శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ నాయకులు ,పోగుల శంకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,లింగారావు, ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కొండ్రశంకర్ ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.