20 June, 2026 | 3:41 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

ప్రజల ఆరోగ్యంపై మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి

03-09-2024 11:45 AM

మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండల ప్రజల ఆరోగ్యంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. మండలంలోని అన్ని గ్రామాలలో విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వారి గ్రామంలోనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించినట్లు మాజీ జడ్పిటిసి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం తెలిపారు. కేషనపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడుతూ... విష జ్వరాలతో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందుతుందని సూచించారు. వైద్య శిబిరాన్ని తనిఖీ చేయడానికి వచ్చిన డిఆర్డిఓ రవీందర్ తోపాటు మండల వైద్యాధికారి అమరేందర్ రావుతో మాట్లాడారు. జ్వరం వచ్చిన వారిని ప్రత్యేక దృష్టితో చూసి వైద్య పరీక్షలు చేసి నాణ్యమైన మందులు అందించాలని కోరారు. ఎంతో ఓపికతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న మండల వైద్యాధికారితో పాటు సిబ్బందికి సదానందం కృతజ్ఞతలు తెలిపారు.