8 April, 2026 | 8:32 AM

మంథని ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

13-02-2026 04:14 PM

కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు .

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

మంథని,(విజయక్రాంతి): ఈ మున్సిపల్ ఎన్నికల్లో(Manthani Municipality) కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించి, నాపై నమ్మకం ఉంచిన మంథని మున్సిపల్ ప్రజలకు పేరుపేరున రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.  నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాకుండా, మీ కళ్ల ముందు కనిపించే మార్పులో చూపిస్తానని మంత్రి తెలిపారు. 

మీ అందరి సహకారంతో మంథని మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని, ఈ గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు  నాయకులకు పేరుపేరునా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. విజయగర్వంతో కాకుండా, ఇక బాధ్యతతో మీ సేవలో నిరంతరం ఉంటామని శ్రీధర్  బాబు మంథని పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు.