13-02-2026 04:10:44 PM
పాసు లేకుండా కౌంటింగ్ హాల్లొకి ఎమ్మెల్యే వినోద్ వెళ్లడంపై రగడ
బీఆర్ఎస్ అభ్యర్థులు గొడవ
కౌంటింగ్ కేంద్ర వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కౌంటింగ్ హాల్లో ఎమ్మెల్యే అనుమతి లేకుండా పోవడంపై కలకలం రేపింది. అక్కడే ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యే రాకపై అభ్యంతరం చెపుతూ గొడవకు దిగారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ కౌంటింగ్ కేంద్రంలోకి రావడానికి ఎలా అనుమతి ఇచ్చారని బీఆర్ఎస్ కాండేట్లు,ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి ఎన్నికల అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ నేరుగా కౌంటింగ్ ఎదుటకు వచ్చి రిసెప్షన్ వేదిక వద్ద కూర్చున్నారు.
గమనించిన బిఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యేతో ఎలా వచ్చారని వాగ్వాదం చేశారు. తమ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నాయన లోనికి అనుమతి నిరాకరించిన అధికారులు, ఎమ్మెల్యేను ఎలా సమ్మతించారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ కాండేట్ బత్తుల అనిత ఏజెంటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ అభ్యర్థి తాండ్ర రామకృష్ణ గొడవకు దిగారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ ఏజెంట్లు ముచ్చర్ల మల్లయ్య లతో బీ ఆర్ఎస్ లీడర్లతో వాగ్వాదం ఉద్రిక్తతకు నెలకొంది.
అక్కడే ఉన్న బెల్లంపల్లి ఏసీ పీ రవికుమార్ ఇరువర్గాలను శాంతింప చేశారు. గొడవను సద్దుమణించారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత ఎమ్మెల్యే లోనికి రావడంతో కౌంటింగ్ హాల్లో ఒక్కసారి అలజడి రేగింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా కౌంటింగ్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఒకసారి కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఉధృతంగా ఉద్రిక్తంగా మారింది. ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో ఈ అపశృతి దొరిలింది. మొత్తానికి అయితే కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది.