ఉప్పల్ - ఘట్ కేసర్ ఫ్లైఓవర్ పై కొత్త టెండర్లు : మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్ : భారత్ మాల స్థానంలో కొత్త ప్రాజెక్టు తీసుకోస్తున్నామని తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ - ఘట్ కేసర్ మధ్య రహదారి పనులు 40 శాతమే పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉప్పల్ - ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణంపై ఉన్న టెండర్లు రద్దు చేసి, కొత్త టెండర్లకు ప్రకటన ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ - విజయవాడ హైవేను 6 లైన్ల రహదారిగా మార్చాలని కేంద్రమంత్రిని కోరమన్నారు. అంతేగాక గత ప్రభుత్వ హయంలో నిర్లక్ష్యం చేయబడ్డ 16 రూడ్లపై వారికి నివేదిక ఇచ్చామని, వాటిలో కొన్నింటిని హైవేలుగా మార్చాలని కోరడంతో దానిపై సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు. మంగళవారం కిషన్ రెడ్డి, భూపేంద్ర యాదవ్ అపాయింట్ మెంట్ కోరామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.






