12 March, 2026 | 10:57 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

కర్మన్ ఘాట్ ఆలయంలో మంత్రి శ్రీహరి పూజలు

11-06-2025 12:21 AM

ఎల్బీనగర్, జూన్ 10 : మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యుడు వాకిటి శ్రీహరి సతీ సమేతంగా మంగళవారం కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానాన్ని సందర్శించి ధ్యానాంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా హనుమాన్ ఆలానికి వచ్చిన శ్రీహరికి ఆలయ ఈవో లావణ్య, వేద పండితులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి దంపతులకు స్వామివారి శేష వస్త్రాలు అందజేసి, వేద పండితుల ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఈవో లావణ్య, ఆలయ చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలుపాల్గొన్నారు.