16 April, 2026 | 8:13 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ట్రంక్ లైన్ పనులను పూర్తి చేయిస్తా

11-06-2025 12:19 AM

టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్

ఎల్బీనగర్, జూన్ 10 : మన్సూరాబాద్, హయత్ నగర్ డివిజన్లలోని 10 కాలనీలకు ఉపయోగపడే డ్రైనేజీ ట్రంక్ లైన్ పనులు తొందరగా పూర్తి చేయించాలని జలమండలి అధికారులను టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కోరారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని బాలాజీ నగర్ పార్కును మంగళవారం ఆయన సందర్శించి, మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడారు.

పార్కులో రూ. 50 లక్షలతో వాచ్ మెన్ గది, టాయిలెట్స్, పిల్లల ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ ను ఇటీవల మధుయాష్కీ మంజూరు చేయించి పనులు పూర్తి చేసినందుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

డ్రైనేజీ ట్రంక్ లైన్ పనులను తొందరగా పూర్తి చేయించి సమస్యను తీర్చాలని ఈ సందర్భంగా పరిసర కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు మధుయాష్కీని కోరారు. ఈ సందర్భంగా ఆయన స్పందించి జలమండలి డీజీఎం మాధవితో ఫోన్లో మాట్లాడారు. పనులను వేగంగా పూర్తి చేయించాలని, నిధులకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని సూచించారు.

ఆటోనగర్ లోని జింకల పార్క్ సందర్శన

ఆటోనగర్లోని జింకల పార్కును మధుయాష్కీ గౌడ్ సందర్శించారు. వాకర్స్ తో కలిసి పార్కులో వాకింగ్ చేశారు.  పెరుగుతున్న కొత్తగా రెండు ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేయాలని కోరారు. యోగా షెడ్ ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లెక్చరర్స్ కాలనీలో పర్యటించి, కాలనీవాసుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు బుడ్డా సత్యనారాయణ, వేణుగోపాల్ యాదవ్, కుట్ల నర్సింహా యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేలపాటి రామారావు, నాయకులు భీమిడి రామకృష్ణారెడ్డి, సుధాకర్ గౌడ్, కళ్లెం నరసింహారెడ్డి, రమేష్ నాయక్, దాము మహేందర్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.