భద్రకాళిని దర్శించుకున్న మంత్రి సురేఖ
08-06-2024 02:44 AM
వరంగల్ తూర్పు, జూన్ 7 : తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మం త్రి కొండా సురేఖ శుక్రవారం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని, గజమా లలు, పట్టువస్త్రాలను, ఓడిబియ్యం సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి సురే ఖకు ఆలయ కార్యనిర్వహణాధికారి శేషుభారతి, ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రికి అర్చకులు అమ్మవారి శేషవస్త్రాలను, వేదాశీర్వచనం అందజేశారు.






