calender_icon.png 8 September, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్చరీ ఛాంపియన్ చికితను సత్కరించిన సీఎం రేవంత్

08-09-2025 02:30:01 PM

హైదరాబాద్: ఆర్చరీ ఛాంపియన్ చికిత తనిపర్తి(Archery Champion Chikitha Taniparthi) సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. కెనడాలో జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌ షిప్‌ లో భారతదేశానికి స్వర్ణ పతకం గెలుచుకున్న తొలి మహిళగా చికిత రికార్డు సృష్టించింది. ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌తో పాటు చైనాలోని షాంఘైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ టీమ్ ఈవెంట్‌ లో రజత పతకం గెలుచుకున్నందుకు రేవంత్ రెడ్డి చికితను అభినందించారు. ఈ సందర్భంగా చికితను సీఎం రేవంత్ సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌ లో పతకం సాధించడానికి చికితకు పూర్తి శిక్షణ అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలు అందిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే విజయరమణరావు, SATS చైర్మన్ కె. శివసేన రెడ్డి, ఇతర నాయకులు హాజరయ్యారు.