29 July, 2026 | 1:19 PM

వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

29-07-2026 12:41 PM

వేకువజాము నుంచే సాయిబాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ప్రత్యేక పూజలు చేపట్టిన అర్చకులు 

పాపన్నపేట,జులై29: మండల కేంద్రమైన పాపన్నపేటతో పాటు ఆయా గ్రామాల్లో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు(Guru Purnima celebrations) ఘనంగా నిర్వహించారు. సాయిబాబా ఆలయాల్లో వేకువజాము నుంచే ప్రత్యేక  పూజలు నిర్వహించారు. పాపన్నపేటలోని షిరిడి సాయిబాబా ఆలయంలో 108 లీటర్ల ఆవుపాలతో బాబాకు అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు, పూల దండలు, కిరీటంతో అందంగా అలంకరించారు. వివిధ రకాల అలంకరణలో సాయిబాబా శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ పూజారి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. మధ్యాహ్న హారతి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.