13 August, 2026 | 4:04 PM

అమరవరం లిఫ్ట్ నడిపించేందుకు మంత్రి ఉత్తమ్ సానుకూల స్పందన

13-08-2026 02:47 PM

హర్ష వ్యక్తం చేసిన రైతులు

మఠంపల్లి,(విజయక్రాంతి): ఎల్నోనిల్ ప్రభావంతో వర్షాలు లేక, వేసిన పంటలకు సరిపడా నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలు నీరు లేక ఎండిపోతుండటంతో రైతుల బాధను గుర్తించిన మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండా సర్పంచ్ సక్రునాయక్, దొనబండ తండా సర్పంచ్ అరుణ దేశ్ పాండు, అల్లిపురం సర్పంచ్ జ్యోతి పిచ్చిరెడ్డి హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి  రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.

దాదాపుగా 8 గ్రామ పంచాయతీ రైతుల పంటలను కాపాడేందుకు అమరవరం లిఫ్ట్‌ను నడిపించేలా చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కోరారు.ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి, అమరవరం లిఫ్ట్ నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం పట్ల సర్పంచ్లు,రైతులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూక్యా హనుమా నాయక్, ఉపసర్పంచ్ ధరవతు నితిన్, చంటి,విజయ్ తదితరులు పాల్గొన్నారు.