10 August, 2026 | 12:10 PM

వరుణయాగంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు

10-08-2026 11:02 AM

హైదరాబాద్: వరుణుడి కరుణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana) నిర్వహిస్తున్న వరుణ యాగాన్ని(Varuna Yagam) సోమవారం ఉదయం 4 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy a) దంపతులు సాగర్ తీరాన విజయ విహార్ లో ప్రారంభించారు. మధ్యాహ్నం 3.20 గంటలకు మహా వైదిక క్రతువు పూర్తి కానుంది. 11 హోమకుండాలతో 108 మంది రుత్వికులతో వరుణ యాగం చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో వరుణ యాగం జరుగుతోంది.

వరుణ యాగంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

నేడు నాగార్జునసాగర్‌లో వరుణ యాగంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొననున్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple) చెందిన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో యాగం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 2.45 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు చేరుకుంటారు. అనంతరం విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్(Vijay Vihar Tourism Guesthouse) ప్రాంగణంలో జరిగే వరుణ యాగం వద్దకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. యాగం అనంతరం సాయంత్రం 4 గంటలకు నాగార్జునసాగర్ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.