10 August, 2026 | 1:54 PM

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన

10-08-2026 12:48 PM

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన 

కూసుమంచి, (విజయక్రాంతి): కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ(Central Government) ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం 'జైలు భరో' కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళనలో భాగంగా  సీపీఎం, సీఐటీయూ aiawu నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించ్చారు. లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు కనీస మద్దతు ధరకు (MSP) చట్టబద్ధత కల్పించాలని కోరారు. ధరల పెరుగుదల మరియు నిరుద్యోగాన్ని అరికట్టాలని నినాదాలు చేశారు.