రాంచీలో విద్యార్థుల ఆందోళన ఉద్ధృతం
రాంచీలో కొనసాగుతున్న ఉద్రిక్తత
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో(Ranchi) ఉద్రిక్తత కొనసాగుతోంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని బీజేపీ ధర్నా(BJP Protest) చేస్తోంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Jharkhand Chief Minister Hemant Soren) నివాసం ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. ధర్నా చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు(BJP leaders arrested) అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళన కారులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్లకు తరలించారు.
నిన్న మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం(Government of Jharkhand) ప్రకటించింది. మూడు పరీక్షల నిర్వహణపై సోరెన్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. రాంచీలో విద్యార్థులు ఆందోళనలను ఉద్ధృతం చేశారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు. నియామక పరీక్షల నిర్వహణలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. జార్ఖండ్ లో జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కెనాన్లను ఉపయోగిస్తున్నప్పటికీ, వారు డాన్స్ చేస్తూ తమ 'విధానసభ ఘెరావ్' యాత్రను కొనసాగించారు.






