calender_icon.png 13 February, 2026 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాశివరాత్రి ఉత్సవాలకు మంత్రులకు ఆహ్వానం

13-02-2026 12:51:21 AM

కాళేశ్వరం, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర మంత్రులను ఆ హ్వా నించారు.ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కి ఆలయ కార్యనిర్వహణాధికారి మహేష్, దేవాలయ ఉప ప్ర ధానార్చకులు పనకంటి పనీంద్ర శర్మ ఆహ్వాన పత్రికను అందజేశారు.

మహాశివరాత్రి వేడుకలకు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను కూడా కలిసి మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎస్. మహేష్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయ అర్చకులు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.