4 April, 2026 | 2:09 PM

Breaking News

క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •   నాటు సారా తాగి ముగ్గురు మృతి — సారా వల్లే మరణించారా ?   •   పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన   •  

బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయ కాంత్ రెడ్డికి పితృ వియోగం

13-02-2026 12:47 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బిగ్ టీవీ ఛైర్మెన్ వెన్నం విజయ కాంత్ రెడ్డి తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి (80) మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు.

రాఘవేందర్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న మంత్రి సీతక్క, డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, డాక్టర్ భూక్యా మురళి నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎ మ్మెల్యే శంకర్ నాయక్, మహబూబాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ పక్షాల నేతలు, వివిధ సంఘాల నాయకులు, తదితరులు రెడ్యాలకు చేరుకొని చేరుకొని దివంగత రాఘవేందర్ రెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అ నంతరం శ్రీకాంత్ రెడ్డి, విజయ కాంత్ రెడ్డి లను పరామర్శించి ఓదార్చారు. స్వర్గీయ రాఘవేందర్ రెడ్డి భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు.