9 August, 2026 | 2:59 PM

లాల్ దర్వాజా అమ్మవారికి ప్రభుత్వం పట్టువస్త్రాలు

09-08-2026 01:41 PM

హైదరాబాద్: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్ దర్వాజా(Lal Darwaza Simhavahini Ammavari Temple) శ్రీ సింహవాహిని అమ్మవారి ఆలయంలో శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.  కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కార్పొరేషన్ చైర్మన్ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు , పోలీస్ కమిషనర్ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులు పాల్గొన్నారు.