16 April, 2026 | 7:20 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

మంత్రులే బాధ్యత వహించాలి

02-03-2026 12:55 AM

పేదలకు న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉధృతం: సీపీఎం  

రఘనాథపాలెం/ఖమ్మం,మార్చి 1(విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలో పేదల కూల్చివేతకి జిల్లాకి చెందిన ముగ్గురు మంత్రులే నైతిక బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూల్చి వేసిన ఇళ్ల్లు ఉన్న భూదాన భూ ములు విషయంలో మంత్రి తుమ్మల వ్యా ఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆదివారం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోతినేని మాట్లాడుతూ మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.

భూదాన భూములు విలువైనవని పేర్కొనడం సరైనది కాదని అన్నారు. చట్టాన్ని పక్కన పెట్టి విలువైన భూములు అనే పేరుతో పేదలను అక్కడి నుంచి వెళ్లగొట్టడం చట్ట ఉల్లంఘనతో సమానమని స్పష్టం చేశారు. గుట్టల్లో ఇళ్లు వేసుకుని నివసిస్తున్న వారు అంతా పేదలేనని, వారికి న్యాయం చేయాలని కోరారు.