14 July, 2026 | 4:08 PM

Breaking News

ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •  

గాంధీ భవన్‌కు మంత్రులు.. ప్రజలతో ముఖాముఖి

23-09-2024 05:07 PM

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధ, శుక్రవారాల్లో ఒక్క మంత్రి గాంధీభవన్ కు రావాలని మహేష్ గౌడ్ సూచించారు. వారానికి 2 రోజుల పాటు గాంధీభవన్ కు మంత్రులు సందర్శించనున్నారు. బుధ, శుక్రవారాల్లో ఉ. 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రులు ముఖాముఖి నిర్వహించనున్నారు. బుధవారం నుంచే ప్రజలు, కార్యకర్తలతో మంత్రుల ముఖాముఖి ప్రారంభం కానుంది. ఎల్లుండి తొలిరోజు మంత్రి రాజనర్సింహతో ప్రజలు, కార్యకర్తలు ముఖాముఖిలో పాల్గొనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి పగ్గాలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.