31 July, 2026 | 10:06 PM

పుల్లూరులో ఘనంగా బోనాల మహోత్సవం

31-07-2026 09:30 PM

- భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు మొక్కుల చెల్లింపు

సిద్దిపేట రూరల్: పుల్లూరు గ్రామంలో  కనకదుర్గాదేవి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. బీఆర్ఎస్ మండల నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు మంగళారపు అశోక్, ఉపాధ్యక్షుడు నక్క రాజేందర్, ప్రధాన కార్యదర్శి దేశెట్టి బాలరాజు, కార్యదర్శి ఎల్లయ్య గారి రమేష్, కోశాధికారి ఓగ్గు లచ్చయ్య పాల్గొన్నారు.