30 July, 2026 | 11:36 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే గుడ్ బై

30-07-2026 10:58 AM

అనుభవజ్ఞుడైన భారత క్రికెటర్ అజింక్య రహానే(Indian cricketer Ajinkya Rahane) అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. 2013లో ప్రారంభమైన తన కెరీర్‌లో రహానే భారత జట్టు తరపున 85 టెస్టులు మ్యాచుల్లో 12 శతకాలు, 26 అర్ధ శతకాలు, 90 వన్డే మ్యాచుల్లో మూడు శతకాలు, 24 అర్ధ సెంచరీలు చేశాడు. 20 టీ20 మ్యాచ్‌లు ఆడిన 38 ఏళ్ల రహానే, ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

అయితే, వెస్టిండీస్‌తో జరిగిన 2023 విదేశీ టెస్ట్ సిరీస్‌లో అతను చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు. రహానే దేశవాళీ క్రికెట్‌లో చురుకుగా ఉంటూ, 2024-25 సీజన్ వరకు ముంబై జట్టుకు నాయకత్వం వహించాడు. Instagram వేదికగా రిటైర్మెంట్ ప్రకటించిన రహానె భావోద్వేగానికి గురయ్యాడు. రహానె కెప్టెన్సీలోనే టీమిండియా బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) సాధించింది. 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు నాయకత్వం వహిస్తూ, 14 మ్యాచ్‌లలో 335 పరుగులు సాధించాడు. భారత జట్టులోకి తిరిగి రావాలనే ఆసక్తిని ఈ సీనియర్ బ్యాటర్ ఇటీవల వ్యక్తం చేసినప్పటికీ, చివరకు 17 ఏళ్ల సుదీర్ఘమైన తన కెరీర్‌కు ముగింపు పలికాడు.