calender_icon.png 29 August, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిరాయ్ గూజ్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉన్నాయ్

29-08-2025 02:05:06 AM

తేజ సజ్జా పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండ ర్ ‘మిరాయ్’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిం చారు. మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపు ల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌రై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. మేకర్స్ ట్రైలర్‌ని లాం చ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘నేను మన తెలుగు ఆడియన్స్ కోసం నటిస్తున్నాను.

మీ అందరి మెప్పు కోసం చేస్తున్నాను. నా సినిమా మిగతా భాషల వారికి నచ్చితే అది బోనస్ అంతే. ఈ సినిమాలో ఎలివేషన్స్ మూమెంట్స్ మామూలుగా ఉండ వు. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వున్నాయి. సెప్టెంబర్ 12న చాలా క్లీన్ ఫిలిం తీసుకొస్తున్నాం. పిల్లలు ఫ్యామిలీ అం దరు కలిసి చూసే సినిమా ఇది’ అన్నారు. హీరోయిన్ రితిక మాట్లాడుతూ.. ‘మేము చాలా కష్టపడి సినిమా చేశా ము. ప్రతి ఒక్కరు సోల్ పెట్టి పని చేసాం.

తప్పకుండా ఈ సినిమా మీకు థియేటర్స్ లో గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’ అన్నారు. మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘మిరాయ్ పై చాలా కలలు ఆశలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఇందులో నాది చాలా పవర్ ఫుల్ రోల్. నా జీవితంలో ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదు’ అన్నారు.

డైరెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘చాలా సిన్సియర్‌గా తీసిన సినిమా ఇది. మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను‘ అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా చేస్తుం ది. థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను‘ అన్నారు.