7 May, 2026 | 3:13 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

14వ శతాబ్దం కథాంశంతో ద్రౌపతి 2

29-08-2025 02:06 AM

నేతాజీ ప్రొడక్షన్స్ తరపున చోళ చక్రవర్తి, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా రూపొందిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపతి -2’. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది వరకు పళయ వన్నారపేట్టై, ద్రౌపతి, రుద్ర తాండ వం, బకాసురన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మోహన్.జి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

నట్టి నటరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మోహన్.జి, పద్మ చంద్రశేఖర్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్, ఫిలిప్ ఆర్.సుందర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థనికా టోని కొరియోగ్రఫీ, యాక్షన్ సంతోష్, ఎడిటర్గా దేవరాజ్, ఆర్ట్ డైరెక్టర్గా కమలనాథన్ బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. ఇది 14వ శతాబ్దానికి చెందిన కథాంశంతో తెరకెక్కుతోంది. ఆ సమయం లోనే మొఘల్ చక్రవర్తులు తమిళనాడులోకి ప్రవేశించారు.

రక్తంతో రాసిన చరిత్రాక ఘటనల ఆధారంగా సినిమా రూపొందుతోంది. దక్షిణ భారతదేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజులు, వీరత్వం, త్యాగం, రక్తంతో రాసిన చరిత్రకు నిదర్శనంగా నిలిచారు.

ఈ చారిత్రక కథనం 2020లో విడుదలైన ద్రౌపతి సినిమా కథతో ఎలా అనుసంధానమవుతుందో అనే విషయం ప్రధానాంశంగా నిలుస్తోంది. ఇదే అనుసంధా నం ద్వారా ఈ చిత్రం ద్రౌపతి సిరీస్లో రెండవ భాగంగా రూపొందుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది చివరలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.