10 July, 2026 | 8:58 AM

ముంబై గుహల్లో మిరాయ్

21-05-2025 12:33 AM

సూపర్ హీరో తేజ సజ్జా తన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ తర్వాత చేస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘మిరాయ్’. యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తేజ సజ్జా ఈ చిత్రంలో సూపర్ యోధ పాత్ర కోసం మేకోవర్ అయ్యారు.

మనోజ్ మంచు విలన్‌గా, రీతికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొత్త షెడ్యూల్ ముంబయిలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ సజ్జాతోపాటు కొన్ని ప్రధాన పాత్రల నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు టీమ్ సిద్ధమవుతున్నారు.