21-05-2025 12:35:13 AM
తెలుగు సినిమా రంగంలో ‘మాయాబజార్’ ఓ క్లాసిక్. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారా వు, సావిత్రి, రేలంగి, గుమ్మడి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పౌరాణిక చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి రూపొందించారు.
కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా మరోమారు వెండితెరపై సందడి చేయనుంది. ఈ నెల 28న ఎన్టీ రామారావు 102వ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.