calender_icon.png 20 May, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను అలా ఏడిపించేవాళ్లు

20-05-2025 12:39:07 AM

కొంతమంది కథానాయికలు కెరీర్ ఆరంభంలోనే చాలెంజింగ్ పాత్రలు చేస్తూ మెప్పిస్తుంటారు. అదే సమయంలో కష్టాలు ఎదుర్కొంటారు. యంగ్ బ్యూటీ ఇవానా కూడా అదే చెబుతోంది. ఎన్నో అవమానాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నానంటూ అంటోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఇవానా తర్వాత హీరోయిన్‌గా మారింది.

తమిళ్‌లో ‘లవ్ టుడే’ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ‘సింగిల్’గా వచ్చిన శ్రీవిష్ణుతో జోడీ కట్టి టాలీవుడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ చిన్నదానికి తెలుగులో క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇవానా మాట్లాడుతూ తన గురించి ఆసక్తికర విషయాలను చెప్పింది.

‘చిన్నప్పుడు ఎత్తు విషయంలో చాలా మంది ఏడిపించేవారని చెబుతూ బుంగమూతి పెట్టుకుంది. “చిన్న వయసు నుంచే సినిమాలపై ఇష్టం ఉండేది. అందుకే సినిమాల్లోకి వచ్చా. కెరీర్‌లో ముందుకు సాగేందుకు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. చాలా అవమానాలు, రిజక్షన్స్ ఎదుర్కొన్నా. చిన్నప్పు డు నేను హైట్ తక్కువగా ఉండటంతో నన్ను హర్ట్ చేసేలా మాట్లాడేవారు. స్కూల్‌లో నన్ను ఫ్రెండ్స్ ‘పొట్టి’ అని ఏడిపించేవారు. వాళ్ల మాటలు చాలా బాధపెట్టేవి. దాంతో నేను చదువుపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయా” అని తెలిపింది.