24 August, 2026 | 10:24 PM

Breaking News

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •  

నిధుల దుర్వినియోగం.. మాజీ సర్పంచ్ అరెస్ట్

21-06-2025 01:33 AM

రూ.౨ కోట్ల జిపి నిధుల అంశంలో అవకతవకలు 

రాజేంద్రనగర్, జూన్ 20: గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం కేసులో పు ప్పాలగూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మహేశ్వరం సునీతను నార్సింగి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కేసు వివరాలను ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి వెల్లడించారు. సునీత తన పదవీ కాలంలో పంచా యతీ నిధులు రూ.2,02,30,885ను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రాజేంద్రనగర్ డివిజన్ డివిజినల్ పంచాయతీ అధికారి ఫిర్యాదు  మేరకు జిపి నిధు లు పెద్దమొత్తంలో దారి మళ్లించినట్లు తెలిపారు. హైదరాబాద్ గ్రామ పంచాయతీ ట్రి బ్యూనల్ ఆదేశాల మేరకు దుర్వినియోగమైన మొత్తంలో రూ.23,68,618 ను తిరిగి చెల్లించినా, ఈ చర్య పబ్లిక్ సర్వెంట్గా నమ్మకద్రోహం,మోసానికి సంబంధించింద న్నా రు. తెలంగాణ లోకాయుక్త ఆదేశాల మేరకు, క్రైమ్ నెంబర్ 853/2025 లో 409, 420 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.

విచారణలో ట్రిబ్యూనల్ ఉత్తర్వులు, విచారణ నివేదికలు, చలాన్లు, బాధితురాలి లిఖిత పత్రాలు, ఆధారాలు దొరికాయి. దీంతో మా జీ సర్పంచ్ సునీతను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. నిధుల దుర్వినియోగంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఎవరైనా ఒకటవకులకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఇన్స్పెక్టర్ సూచించారు.