21 August, 2026 | 4:36 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

మహిళతో అసభ్య ప్రవర్తన

04-08-2024 12:00 AM

నిందితుడిపై కత్తితో దాడిచేసిన బాధితురాలి సోదరుడు

ఎల్బీనగర్, ఆగస్టు 3: మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై బాధితురాలు సోదరుడు కత్తితో దాడి చేసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌నగర్ కాలనీకి చెందిన ఓ మహిళతో శుక్రవారం రాత్రి ఇదే ప్రాంతానికి చెందిన హన్మంతు అసభ్యకరంగా ప్రవర్తించాడు. గమనించిన బాధితురాలి కుటుంబ సభ్యులు హన్మంతును నిలదీశారు. ఇదే సమయంలో బాధితురాలి సోదరుడు దేవరాజ్ అక్కడికి వచ్చి కూరగాయలు కోసే కత్తితో హన్మంతుపై దాడి చేశాడు. ఘటనలో హన్మంతుకు తీవ్ర గాయాల య్యాయి. ఇరువర్గాలపై ఎల్బీనగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.